తొలి కిరణం, సెప్టెంబర్ 29 – చిట్వేల్: తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం వ్యాప్తంగా మంగళవారం ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మండల పరిధిలోని 55 ప్రాథమిక పాఠశాలలు, 5 ప్రాథమికోన్నత పాఠశాలలు, ఒక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారులు ఖాజా మొహిద్దీన్, ఈశ్వరులు తెలిపారు. చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్‌గా జడపోలు శివప్రసాద్ గౌడ్, వైస్ చైర్మన్‌గా చనమాల చెంచులక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 19 మంది సభ్యులతో కూడిన కమిటీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్లను ఆమోదించింది. ఈ సందర్భంగా నూతన చైర్మన్ శివప్రసాద్ గౌడ్‌ను వైస్ చైర్మన్ చెంచులక్ష్మి, ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు సోఫియా, ఉపాధ్యాయులు, టీడీపీ మండల అధ్యక్షుడు కాకర్ల నాగార్జున తదితరులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గత రెండు సంవత్సరాలుగా చైర్మన్‌గా సేవలందించిన శంకర్‌రాజును సత్కరించారు. నూతన చైర్మన్ శివప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కొండా వెంకటేష్, బి. రాజశేఖర్, చందు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


