బిజినపల్లి: మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో బిజినపల్లి మండలానికి చెందిన కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మండల అధ్యక్షులు రాములు, అన్ని గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


