నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగర్కర్నూల్ మండలానికి చెందిన కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మండల అధ్యక్షులు కోటయ్య, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు తిరుపతి గౌడ్, గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


