తొలి కిరణం, సెప్టెంబర్ 29 – రైల్వే కోడూరు: వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ డీసీసీ చైర్మన్ కీర్తిశేషులు కొల్లం బ్రహ్మానందరెడ్డి 9వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం రైల్వే కోడూరులో కబడ్డీ క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించారు. కబడ్డీ స్టేట్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన పురుషుల, మహిళల జట్లకు మొత్తం రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని వైఎస్సార్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ రామిరెడ్డి ధ్వజారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందిస్తూ, క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ తోట శివసాయి కౌరెడ్డి, సిద్ధయ్య, కబడ్డీ అసోసియేషన్ సభ్యురాలు అరుణ, ఓబుల్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు హరికృష్ణరెడ్డి, ప్రతాపరెడ్డి, దారుల చంద్రశేఖరరావు, ఆర్.వి. రమణ, సుబ్రహ్మణ్యం రాజు, చెంగల్‌రెడ్డి, గోపి, రమణయ్య, కృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆనంద్ యాదవ్, ప్రసాద్, షఫీ రెడ్డి, కొంచెం హరి, మణి, నాగరాజు, వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.


