తొలి కిరణం ప్రతినిధి, సెప్టెంబర్ 28: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలోని ఆదర్శ పాఠశాల వద్ద ఆర్డినరీ ఆర్టీసీ బస్సులు నిలపకుండా వెళ్లిపోతుండటంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాఠశాల ప్రిన్సిపల్ లీలా శ్రీహరి తెలిపారు.
ప్రతిరోజూ పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు ఆర్టీసీ బస్సుల ద్వారా పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. అయితే ఆర్డినరీ బస్సులు పాఠశాల వద్ద ఆగకపోవడంతో విద్యార్థులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
విద్యార్థుల భద్రత, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆదర్శ పాఠశాల వద్ద ఆర్డినరీ ఆర్టీసీ బస్సులకు తప్పనిసరిగా స్టాప్ ఏర్పాటు చేసి బస్సులు నిలిపేలా ఆర్టీసీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ లీలా శ్రీహరి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ఇబ్బందులను అధికారులు పరిగణనలోకి తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


