తొలి కిరణం ప్రతినిధి, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లాలోని పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారులు సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పీఎస్ బొందలపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసి, వంటశాల పరిసరాల్లో శుభ్రత, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విషయంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు.
అనంతరం యూఆర్ఎస్ బొందలపల్లి పాఠశాలను సందర్శించి పాఠశాలలోని విద్యా, పరిపాలనా అంశాలను పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులకు తగిన సూచనలు, సలహాలు అందించారు.
అదేవిధంగా పీఎస్ శ్రీపురం పాఠశాలలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన అధికారులు విద్యార్థుల తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మరింత పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్తో పాటు జిల్లా గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నిర్మల, డీఎస్ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


