తెలకపల్లి, సెప్టెంబర్ 28: మండలంలోని ఎరువుల దుకాణాల్లో సోమవారం వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు, వ్యవసాయ సహాయ సంచాలకులు పూర్ణచందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి పి. నర్మద ఆధ్వర్యంలో మణికంఠ ట్రేడర్స్, షిరిడీ సాయి ఫర్టిలైజర్స్, అగ్రోసేవ కేంద్రం, శతాక్షి ట్రేడర్స్, అగ్రో రైతు సేవా కేంద్రం–T2 తదితర దుకాణాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా దుకాణాల్లోని ఎరువుల నిల్వలు, స్టాక్ బోర్డు, లైసెన్స్ డిస్ప్లే, గోదాం షట్టర్ డోర్ నంబర్ తదితర అంశాలను అధికారులు తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం వివరాలను ప్రదర్శించని వ్యాపారులను హెచ్చరించి, వెంటనే లోపాలను సరిచేసుకోవాలని సూచించారు.
రైతులకు ఎరువుల విక్రయాల సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు వ్యాపారులకు సూచించారు. రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనల అమలుపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


