తొలికిరణం సెప్టెంబర్ 28 ఘట్కేసర్ ప్రతినిధి
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీమార్ట్ సమీపంలో వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం స్వల్ప రహదారి ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్ స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, వాహనదారుడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదం అనంతరం బైక్ నడుపుతున్న వ్యక్తికి, ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు మధ్య కాసేపు తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోచారం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు. అనంతరం ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా వాహనాలను అక్కడి నుంచి పంపించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


