కల్వకుర్తి, సెప్టెంబర్ 28: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే (MJPT) బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో ‘నషా ముక్త్ భారత్’, ‘వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక అవగాహన సదస్సు, ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, నషా ముక్త్ భారత్ నిర్మాణంలో భాగస్వాములవుతామని ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం రేబీస్ వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వెటర్నరీ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. పిచ్చి కుక్కలు లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. వెంటనే గాయాన్ని ప్రవహించే నీరు, సబ్బుతో శుభ్రంగా కడిగి, ఆలస్యం చేయకుండా యాంటీ రేబీస్ టీకా తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ CHO శ్రీనివాస్, MPHS ప్రమోద్, MPHS(F) సారా సిస్టర్, RKSK అల్గారిథమ్ రమేష్, పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


