ఘట్కేసర్, సెప్టెంబర్ 27 (తొలి కిరణం): పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడకు చెందిన ప్రముఖులు సింగిరెడ్డి సాయిరెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిల పితృమూర్తి దివంగత సింగిరెడ్డి భిక్షపతిరెడ్డి దశదిన కర్మ ఆదివారం ఎస్బీఆర్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ప్రజలు భారీగా హాజరై భిక్షపతిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమానికి మాజీ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్రెడ్డి, మల్లారెడ్డి విశ్వవిద్యాలయ చైర్మన్ చామకూర భద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై భిక్షపతిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం సింగిరెడ్డి సాయిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రజాసేవలో సాయిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ముందంజ
ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ సింగిరెడ్డి సోదరుల ప్రజాసేవా దృక్పథాన్ని, ప్రజలతో వారికి ఉన్న అనుబంధాన్ని ప్రశంసించారు. భిక్షపతిరెడ్డి తన కుమారులను ఉన్నత విలువలతో తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న సాయిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందన్నారు. ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
భారీగా తరలివచ్చిన నాయకులు, ప్రజలు
కార్యక్రమంలో మేడ్చల్ జిల్లాకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, వివిధ పార్టీల ప్రముఖులు, పోలీస్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు, అభిమానులు, నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు. అనంతరం భిక్షపతిరెడ్డి స్మారకార్థం విచ్చేసిన అతిథులు, బంధుమిత్రులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


