ఘట్కేసర్, సెప్టెంబర్ 27 (తొలి కిరణం): హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఘట్కేసర్ పరిధిలోని వందన హోటల్లో ఆహారం తిన్న పలువురు కస్టమర్లు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. హోటల్లో భోజనం చేస్తుండగా కొందరికి తీవ్ర వికారం, వాంతులు ప్రారంభమయ్యాయి. అనుమానం వచ్చి ఆహారాన్ని పరిశీలించగా ప్లేటులో బొద్దింక కనిపించడంతో వారు ఆందోళనకు గురయ్యారు.
అస్వస్థతకు గురైన వారిని వెంటనే ఘట్కేసర్లోని కల్కి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే జాతీయ రహదారిపై ఉన్న హోటల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై ప్రయాణికులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వందన హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


