కడ్తాల్: మైసిగండి మైసమ్మ ఆలయంలో భక్తుల నుంచి అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక దర్శనం పేరుతో అధిక రుసుములు వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేకలు, గొర్రెలు, కోళ్లు కోయించేందుకు ప్రైవేట్ వ్యక్తులు అధిక మొత్తాలను డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. అలాగే ఆలయ పరిసరాల్లోని కిరాణా దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్నారని పేర్కొంటున్నారు.
అధిక వసూళ్ల కారణంగా ఆలయానికి రావాలంటేనే భక్తులు భయపడే పరిస్థితి నెలకొందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యవహారాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని తెలిపారు.
అధికారులు వెంటనే స్పందించి అధిక వసూళ్లను అరికట్టాలని, భక్తుల నుంచి నిర్ణీత రుసుములకే సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే భక్తులు ప్రైవేట్ రూములపై ఆధారపడకుండా దేవస్థానం ఆధ్వర్యంలోని గదులను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


