ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన 10వ తరగతి కవలలు ఖిజ్రా జుబేర్, తూబా జుబేర్ల విషయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరి వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు ఒకేలా సరిపోలడంతో పదో తరగతి బోర్డు పరీక్షల కోసం ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేస్తుండగా యూఐడీఏఐ సిస్టమ్ రెండో దరఖాస్తును డూప్లికేట్‌గా తిరస్కరించింది. దీంతో కుటుంబ సభ్యులు రాంపూర్ జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించగా, అధికారులు యూఐడీఏఐ న్యూఢిల్లీ, లక్నో కార్యాలయాలతో సమన్వయం చేశారు. మూడు నుంచి నాలుగు నెలల సాంకేతిక పరిశీలన, మాన్యువల్ వెరిఫికేషన్ అనంతరం పాత రికార్డులను సరిదిద్ది ఇద్దరికీ వేర్వేరు ఆధార్ గుర్తింపులను కేటాయించారు. అత్యంత అరుదైన ఈ ఘటన బయోమెట్రిక్ వ్యవస్థలోని సాంకేతిక మినహాయింపును వెలుగులోకి తెచ్చింది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


