వంగూరు: వంగూరు మండల కేంద్రంలో ఈ నెల 22న జరిగిన సర్వసభ్య సమావేశం ఘటనపై కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాలను స్థానిక నాయకులు తీవ్రంగా ఖండించారు. విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.
సర్వసభ్య సమావేశంలో తీర్మానాలు గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా అందజేయాల్సి ఉంటుందని, అందులో ఎమ్మెల్యేకు సంబంధం లేదని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యేతో గొడవకు దిగడం సరైన పద్ధతి కాదన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్యే ఎక్కడ అవమానించారో ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు.
జాజాల గ్రామ పర్యటన సందర్భంగా ఇసుక దందాపై చేసిన ఆరోపణలపై కూడా వారు స్పందించారు. వాగులో ఇసుక దందా జరుగుతుందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. అయితే, జాజాల సర్పంచ్ భర్త ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ల నుంచి రూ.2,000 నుంచి రూ.5,000 వరకు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
చింతపల్లి సర్పంచ్ రామ్ భీష్మతో పాటు బీఆర్ఎస్ సర్పంచ్లు సమావేశంలోనే ఉన్నారని, అప్పుడే అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు.
ముఖ్యమంత్రి లేదా స్థానిక ఎమ్మెల్యేపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తిరుమలేష్, పాండు, నందు, విష్ణు, కొండల్, బాలస్వామి, చెన్నయ్య, వెంకటయ్య, సురేష్, చంద్రశేఖర్, నందు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


