తెలకపల్లి, సెప్టెంబర్ 26 (తొలి కిరణం): పాలమూరు ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో మండల స్థాయి టాలెంట్ టెస్ట్‌ను శుక్రవారం జెడ్పీహెచ్ఎస్ తెలకపల్లి పాఠశాలలో నిర్వహించారు. ఈ పరీక్షకు జెడ్పీహెచ్ఎస్ తెలకపల్లి, కేజీబీవీ రాకొండ, ఎంపీయూపీఎస్ గడ్డంపల్లి, జెడ్పీహెచ్ఎస్ గౌరెడ్డిపల్లి పాఠశాలలకు చెందిన 40 మంది విద్యార్థులు హాజరయ్యారు.
తరగతుల వారీగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రథమ, ద్వితీయ స్థానాలకు ఎంపిక చేశారు.
10వ తరగతి: ప్రథమ స్థానం – సాయి చరణ్ (జెడ్పీహెచ్ఎస్ గౌరెడ్డిపల్లి), ద్వితీయ స్థానం – అనురాధ (జెడ్పీహెచ్ఎస్ తెలకపల్లి).
9వ తరగతి: ప్రథమ స్థానం – మీ దహత్ (జెడ్పీహెచ్ఎస్ తెలకపల్లి), ద్వితీయ స్థానం – రాజేశ్వరి (జెడ్పీహెచ్ఎస్ గౌరెడ్డిపల్లి).
8వ తరగతి: ప్రథమ స్థానం – రిషికేశ్ (ఎంపీయూపీఎస్ గడ్డంపల్లి), ద్వితీయ స్థానం – అనూష.
7వ తరగతి: ప్రథమ స్థానం – మనీషా (ఎంపీహెచ్ఎస్ గడ్డంపల్లి), ద్వితీయ స్థానం – నవీన్ (జెడ్పీహెచ్ఎస్ తెలకపల్లి).
6వ తరగతి: ప్రథమ స్థానం – నబిహ (ఎంపీహెచ్ఎస్ గడ్డంపల్లి), ద్వితీయ స్థానం – రేణుక (జెడ్పీహెచ్ఎస్ తెలకపల్లి).
విజేతలను అభినందించి ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.300 నగదు బహుమతి, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి నగదు బహుమతులు అందజేశారు. టాలెంట్ టెస్ట్‌లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్, షీల్డ్ అందించారు.
కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ తెలకపల్లి ప్రధానోపాధ్యాయులు శోభన్‌బాబు, మండల విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు అరవింద్, రవీందర్, ఆనంద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


