ఓబనపల్లి: తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబనపల్లి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ కంచమ్మ తల్లి ఆలయంలో ప్రతి పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా రెండో పౌర్ణమి అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు నిర్వాహకులు అన్నదాన సేవ అందించారు.
ఈ కార్యక్రమాన్ని ఓ. మణేయ్య, ఎన్. చిన్నయ్య, ఎన్. గంగయ్య, జి. ప్రసాద్, ఎన్. శివరామయ్య, ఎన్. సుబ్బరామయ్య, గడ్డం శ్రీరాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజున భక్తులకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారి చిన్నయ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కంచమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు ప్రార్థించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


