పోల్కంపల్లి, సెప్టెంబర్ 26: నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాటం తెలంగాణ చరిత్రలో మరువలేనిదని అన్నారు. భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం ఆమె సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీరవనితగా చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంకు నారమ్మ, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, ఎడ్మ సత్యం, అచ్చంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, గణేష్ రావు, నరేందర్ రావు, మంద రాజేందర్ రెడ్డి, శ్రీపతిరావు, సుగూర్ బాబు, కర్ణాకర్ రావు, అంకూర్ అంజి, లక్ష్మణ్, కుర్ర వంశీ, ఎల్లా గౌడ్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు జూపల్లి జంగయ్య, అంకు సురేందర్, పుప్పాల రవీందర్, పుల్లయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్, అంకు రాములు, అంకు గోపాల్, రవి యాదవ్, సుర్వి శంకర్, సీపీఎం బాలయ్య, సురేష్ యాదవ్, సయ్యద్ ముజాహిద్, జైపాల్ యాదవ్, వేముల గోపాల్, పర్వతాలు, సత్యం గౌడ్ తదితరులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


