• ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు, మెడల్స్, సర్టిఫికెట్లు
బిజినపల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించేందుకు పాలమూరు ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో బిజినపల్లి మండల కేంద్రంలో ప్రతిభా పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. మండల విద్యాధికారి మైనుద్దీన్ నేతృత్వంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల ఉన్నత పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. తరగతుల వారీగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు, మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గంగారం ప్రధానోపాధ్యాయులు బాలకృష్ణ రెడ్డి, ఉపాధ్యాయులు చంద్రమోహన్ రెడ్డి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


