వనపర్తి, సెప్టెంబర్ 26: విద్యాపర్తిగా పేరుగాంచిన వనపర్తి జిల్లాకు పేరు తెచ్చేలా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ అన్నారు.
కొత్తకోట పట్టణం ఐదో వార్డు కౌన్సిలర్ ముంత మంజుల రామకృష్ణ కుమార్తె ఎం. భవాని ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా డాక్టర్ సతీష్ యాదవ్ ఆమెను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యను కొనలేమని, పట్టుదలతో, ఇష్టపడి చదివితేనే ఉన్నత ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో విద్యకు దూరమవుతున్న విద్యార్థులు భవాని వంటి ప్రతిభావంతులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులు సినిమాలు, సెల్ఫోన్లు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుపై పూర్తి దృష్టి సారించాలని కోరారు. భవాని ఎంబీబీఎస్ సీటు సాధించడం అభినందనీయమని, ఆమెను సన్మానించే అవకాశం రావడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని డాక్టర్ సతీష్ యాదవ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మంజుల రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ సత్యం యాదవ్, ఆశన్న, తిరుపతయ్య, ఖాజా, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


