తెలకపల్లి: మండల కేంద్రంలో వీధికుక్కల సంచారం రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారులు, కాలనీలు, పాఠశాలల పరిసరాల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో చిన్నారులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.
గతంలోనూ తెలకపల్లిలో వీధికుక్కలు పలువురిపై దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం కుక్కల సంఖ్య మరింత పెరగడంతో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రహదారులపై కుక్కలు గుంపులుగా తిరుగుతూ ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని పేర్కొంటున్నారు.
కుక్కల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, ప్రజల భద్రతకు ముప్పు కలగకుండా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. భవిష్యత్తులో కుక్కల దాడుల ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


