• విద్యార్థులకు బ్యాగులు, నోట్స్, బెల్టులు, షూస్ పంపిణీ
పాలెం: ప్రభుత్వ జూనియర్ కళాశాలను నోడల్ అధికారి శ్రీ వెంకటరమణ ఆకస్మికంగా సందర్శించి కళాశాల రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి చదువుపై పలు సూచనలు చేశారు.
విద్యార్థులు కష్టపడి చదివి సకాలంలో పరీక్షలకు హాజరై మంచి మార్కులు సాధించాలని సూచించారు. నిర్ణీత సమయంలో సిలబస్ పూర్తి చేసి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, నోట్స్, బెల్టులు, షూస్ పంపిణీ చేశారు.
కళాశాల ప్రిన్సిపాల్ స్వామి విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు మదన్మోహన్రెడ్డి, గౌస్ మొయినుద్దీన్, నరసింహ, జానయ్య, విష్ణు, ప్రవీణ్, పద్మజ, వినోద్, ఆఫీస్ సూపరింటెండెంట్ నిరంజన్, సిబ్బంది శ్రీరామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



