తెలకపల్లి: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్వీ జిల్లా సమన్వయకర్త, అనంతసాగర్ మాజీ సర్పంచ్ అతినారపు విష్ణుసాగర్ స్పందించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డుల పంపిణీ జరిగిందని, ఇందుకు సంబంధించిన వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయని తెలిపారు. గతంలో జరిగిన పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తండ్రి కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు.
రేషన్ కార్డులపై రాజకీయ విమర్శలు కాకుండా సివిల్ సప్లయ్స్ శాఖ అధికారిక రికార్డుల ఆధారంగా వాస్తవాలు తేల్చాలని విష్ణుసాగర్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని కార్డులు మంజూరయ్యాయి, ఎన్ని పంపిణీ చేశారనే వివరాలను ప్రజల ముందుంచాలని కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


