తెలకపల్లి: మండల ప్రజలకు కీలకమైన తహసీల్దార్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. వర్షాలు కురిసినప్పుడు పైకప్పు నుంచి నీరు కారడంతో పాటు పెచ్చులు ఊడిపడుతున్నాయి. దీంతో సిబ్బంది, కార్యాలయానికి వచ్చే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కార్యాలయ నిర్మాణానికి గతంలో నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కాలేదని స్థానికులు తెలిపారు. మరమ్మతులతో కాకుండా పాత భవనాన్ని తొలగించి, కొత్త భవనం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


