చిట్వేలి, సెప్టెంబర్ 25 (తొలి కిరణం): చిట్వేలి మండలం తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ అడ్వైజర్ రెడ్డీస్ అసోసియేషన్ కమిటీ గౌరవ అధ్యక్షులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. రైల్వే కోడూరు మాజీ వైస్ ప్రెసిడెంట్ రామిరెడ్డి ధ్వజారెడ్డి, నాగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సాంబెత్తిన నవీన్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం వైఎస్సార్సీపీ పార్టీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని నాయకులు శాలువాతో సత్కరించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు కోరినట్లు పేర్కొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


