తొలి కిరణం, సెప్టెంబర్ 24: కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచులు రామ్‌రెడ్డి, శాంతమ్మ కొద్దిరోజుల వ్యవధిలో మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి వారి కుటుంబాలను పరామర్శించారు. ఇరు కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకట్‌రెడ్డి, సాయిబాబా రాజు, వెంకటన్న గౌడ్, నరేందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఎంట్ల రవి, బంధుమిత్రులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



