తొలికిరణం, సెప్టెంబర్ 24, ఘట్కేసర్ ప్రతినిధి: పర్యావరణ మార్పులు, మారుతున్న జీవనశైలి కారణంగా ఏర్పడుతున్న వ్యాధులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు సూచించారు.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని కొర్రెముల గ్రామంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్ఫూర్తి ఆర్గనైజేషన్, కొండాపూర్ విజ్ఞాన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు.
మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ అప్పారావు నాయుడు, స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ల యాదగిరి ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. కామినేని ఆసుపత్రికి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ సుధ, ఆర్థోపెడిక్ డాక్టర్ మోక్సిత, జనరల్ ఫిజిషియన్లు సమంత, కార్తిక్ గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందజేశారు.
అనంతరం విజ్ఞాన్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు బృందాలుగా గ్రామంలో పర్యటించి స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను పరిశీలించారు. గ్రామ సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బొడ్డు వినోద నాగార్జున, మాజీ ఉపసర్పంచులు కందుల రాజు, బొడ్డు నాగార్జున, మాజీ వార్డు సభ్యులు దయ్యాల అంజనేయులు, స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు మేకల పద్మారావు, ప్రధాన కార్యదర్శి కంది సత్యనారాయణ, సభ్యులు పరుశరాం, కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి శ్రీలత, కామినేని హాస్పిటల్ మార్కెటింగ్ అధికారి బాలకృష్ణ, వైద్యులు సుధ, మోక్సిత, సమంత, కార్తిక్, నాయకులు తరిణే మహేంద్ర చారి, మాటూరి రవి, నర్సింహా, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు చంద్రశేఖర్, రమ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


