తొలి కిరణం, సెప్టెంబర్ 23, ఘట్కేసర్ ప్రతినిధి: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్‌కుమార్ బుధవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్ గౌడ్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం పార్టీ కార్యక్రమాలు, యువజన కాంగ్రెస్ కార్యకలాపాలు, స్థానిక ప్రజా సమస్యలపై ఆత్మీయంగా చర్చించారు. పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకుడు సాయి నిరుడు సాయి కుమార్ పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):


