తొలికిరణం, సెప్టెంబర్ 23,
సూర్యాపేట జిల్లాలోని నూతనకల్, ఆత్మకూర్ మండలాల్లో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ, నివారణ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కళాజాతా నిర్వహించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి సుధాకర్ పర్యవేక్షణలో అభినవ ఆర్ట్స్ అకాడమీకి చెందిన పరమేష్ జానపద కళాబృందం సభ్యులు పల్లె సుద్దులు, నాటికలు, వివిధ కళారూపాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
హెచ్ఐవీ ఎలా సంక్రమిస్తుంది, వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సుఖవ్యాధుల నివారణ, టోల్‌ఫ్రీ నంబర్ 1097 ప్రాముఖ్యత, బేరక్ ఫ్రీ క్యూఆర్ కోడ్ తదితర అంశాలను కళారూపాల ద్వారా వివరించారు. కార్యక్రమంలో టీమ్ లీడర్ పరమేష్, లింక్ వర్కర్లు నర్సింహా, నాగేందర్, సతీష్, శైలజతో పాటు గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


