అమరావతి, సెప్టెంబర్ 22 (తొలి కిరణం):
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు రాత్రి లేదా ఎల్లుండి తెల్లవారుజాములోగా విశాఖపట్నం–గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది.
వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పలు జిల్లాలకు అలర్ట్
నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
రేపు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు యానాం ప్రాంతానికి రెడ్ అలర్ట్ ప్రకటించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


