పుల్లంపేట, సెప్టెంబర్ 22 (తొలి కిరణం):
తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలోని ఎస్బీపీఎస్ఎస్ హైస్కూల్, ఎస్‌బీవీడీ సభ హైస్కూల్‌ను తిరుపతి డివిజనల్ విద్యాశాఖ అధికారి శ్రీమతి ఇందిరాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రగతి, బోధనా విధానాలను పరిశీలించారు.
అనంతరం 2025–26 ఎస్ఎస్సీ ఫలితాలపై సమీక్ష నిర్వహించి, ప్రస్తుతం అమలు చేస్తున్న ‘మిషన్ మార్చ్–2027’ కార్యక్రమం పురోగతిపై ఉపాధ్యాయులతో చర్చించారు. మార్చి–2027లో జరిగే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పుల్లంపేట మండలాన్ని విద్యా ఫలితాల్లో జిల్లాలోనే ముందంజలో నిలిపేందుకు ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని డీఈఓ ఇందిరాదేవి కోరారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వెనుకబడిన విద్యార్థులను గుర్తించి అదనపు బోధన అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి డివిజన్ విద్యాశాఖ అధికారి ఇందిరాదేవితో పాటు మండల విద్యాశాఖ అధికారి–1 శ్రీ జి. చక్రధర్ రాజు, రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాలు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


