నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 22: తెలంగాణ ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఆయుష్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుష్ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సురేష్ విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, మంచి ఆరోగ్య అలవాట్ల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యోగా, ధ్యానం, వెల్నెస్ వాక్ నిర్వహించడంతో పాటు ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, ఆయుర్వేద ప్రాధాన్యత, ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన కల్పించారు. చిన్ననాటి నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం.డి. షాబాజ్ మాలిక్, యోగా ఇన్స్ట్రక్టర్లు బి. సాగర్, కె. అంజలి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బాలసాగర్, హరిబాబు, లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



