ఘట్కేసర్, సెప్టెంబర్ 21 (తొలికిరణం ప్రతినిధి):
వీ ఆర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుని ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. యూత్ ప్రెసిడెంట్ పల్లా విక్రమ్ రెడ్డి ఆహ్వానం మేరకు తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్ రెడ్డి కార్యక్రమానికి హాజరై గణనాథుని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఐతా ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ గణపతి ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు, శోభాయాత్రలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని సూచించారు. ఆధ్యాత్మికతతో పాటు ఐక్యత, సాంస్కృతిక సంప్రదాయాలను పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అన్నోజిగూడ గ్రామ శాఖ అధ్యక్షులు విజయ్ రెడ్డి, ఆర్జీకే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెండు మధుకర్ రెడ్డి, వీ ఆర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు, ఇతర అతిథులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


