తొలి కిరణం, సెప్టెంబర్ 21, ఘట్కేసర్ ప్రతినిధి: ఒడిశా నుంచి గోవాకు గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఉప్పల్ జోన్ ఎస్వోటీ పోలీసులు మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని యమ్నంపేట వద్ద పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పద్మనాభస్వామి ఆలయ ఆర్చ్ సమీపంలో మారుతి బలెనో కారును పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కారులో 22 కిలోల గంజాయి లభించింది.
కారులో ఉన్న ఒడిశాకు చెందిన అనిల్‌కుమార్ గౌడ, అవినాష్ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 22 కిలోల గంజాయితో పాటు మారుతి బలెనో కారు, రెండు సెల్ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం వస్తువుల విలువ సుమారు రూ.24 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంలో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


