వనపర్తి, సెప్టెంబర్ 21: అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు, హైదరాబాద్–రంగారెడ్డి జిల్లాల హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు డా. సతీష్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఎస్ఎంఆర్ ఫంక్షన్హాల్లో ఘనంగా పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన పలువురు ఆయనను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన డా. సతీష్ యాదవ్ ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు. ప్రజలకు జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తూ, అఖిలపక్ష ఐక్యవేదికను విస్తరిస్తూ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
నీతి, నిజాయితీతో ప్రజల కోసం పనిచేయడం ఎంతో సవాళ్లతో కూడుకున్నదని, అయినప్పటికీ సతీష్ యాదవ్ ప్రజా సేవను కొనసాగించడం అభినందనీయమన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో ఎస్ఎంఆర్ అధ్యక్షుడు నర్సిరెడ్డి, రిటైర్డ్ రిజిస్ట్రార్ మల్లారెడ్డి, పిచ్చయ్య, రిటైర్డ్ ఆర్మీ అధికారి నాగభూషణం రావు, హుబ్లీ విశ్వనాథం, సత్యనారాయణరాజు, ఆత్మకూరు బద్రీనాథ్, రిటైర్డ్ ఎమ్మార్వో భాస్కర్‌రెడ్డి, యాదగిరి, టీఆర్పీ అధ్యక్షుడు విజయ్‌యాదవ్, జలంధర్, మారం మహేందర్, ప్రదీప్, జమ్ముల శ్రీనివాస్, విశ్వనాథ్, కృష్ణారావు, నాగేందర్, రామశర్మ, పేపర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


