నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో శ్రీ చైతన్య యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ చైతన్య యూత్ ఆధ్వర్యంలో 2005 నుంచి 2026 వరకు 21 సంవత్సరాలుగా గణనాథుడిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గత ఏడేళ్లుగా గణేష్ ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు.
గణనాథుడి ఆశీర్వచనాలు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి సంవత్సరం గణనాథుడిని ప్రతిష్ఠించి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చైతన్య యూత్ సభ్యులు తెలిపారు.
ఈ అన్నదాన కార్యక్రమానికి అన్నదాతలుగా గ్రామ సర్పంచ్ జాలం నాగయ్య, మావిళ్ల కురుమూర్తి, దాసరి కురుమయ్య, అప్పల శివకుమార్, అప్పల మల్లేష్ యాదవ్, ముధం శివకుమార్, అప్పలి ఆంజనేయులు, జాలం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అలాగే చైతన్య యూత్ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



