తొలి కిరణం, సెప్టెంబర్ 19, ఘట్కేసర్ ప్రతినిధి: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఎంఎంసీ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ 8వ వార్డు రాజీవ్ గృహకల్ప 10వ బ్లాక్ వద్ద లెన్వీన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అన్నదాతలు కమతం లక్ష్మి–వెంకటేశ్వర్లు దంపతులు, వారి కుమారుడు–కోడలు కమతం పావని–సాకేత్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లెన్వీన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కాకుల మధు, ఆర్జీకే కాలనీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెండు మధుకర్ రెడ్డి పిలుపు మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గణపతి మహాదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వేముల మహేష్ గౌడ్ అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపతి స్వామివారి మహాప్రసాదాన్ని ఆర్జీకే కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో స్వీకరించారు.
కార్యక్రమంలో పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బద్దం నర్సింహారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గోకారం ఆంజనేయులు గౌడ్, సెక్రటరీ దేవేందర్ ముదిరాజ్, కోశాధికారి బద్దం మల్లికార్జున్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాగరాజు గౌడ్, ఆర్జీకే కాలనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంధమల్ల రమేష్ గౌడ్, పోచారం మాజీ ఉపసర్పంచ్ ఆకిటి బాల్ రెడ్డి తదితరులు పాల్గొని గణపతి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


