నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 19: మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల కళాశాలలో విద్యార్థి భరత్ మృతి ఘటనపై బీఆర్ఎస్వీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల వేధింపుల కారణంగానే భరత్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని ఆరోపిస్తూ, ఘటనకు బాధ్యులుగా పేర్కొంటున్న ఉపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, శంకర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ధర్నా వేదిక వద్దకు వచ్చిన అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాగర్‌కర్నూల్ జిల్లా నాయకుడు అతినారపు విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. భరత్‌ను వేధింపులకు గురిచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. భరత్ మృతికి నిరసనగా నాగర్‌కర్నూల్ పట్టణంలో కళాశాల బంద్ నిర్వహిస్తామని తెలిపారు.
అనంతరం శనివారం శ్రీపురంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల కళాశాల వద్దకు బీఆర్ఎస్వీ నాయకులు వెళ్లగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తెలకపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు బీఆర్ఎస్వీ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ.. అరెస్టులతో తమ గొంతును అణచలేరని, భరత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

