పాలెం, సెప్టెంబర్ 19: నాగర్కర్నూల్ జిల్లా పాలెం గ్రామంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న విఘ్నేశ్వరుడు శనివారం ఆరో రోజు విసర్జనకు బయలుదేరాడు. ఈ సందర్భంగా గ్రామంలో గణనాథుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని కోలాటాలు ఆడుతూ, భక్తిగీతాలు, ఆటపాటలతో సందడి చేశారు. యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. హిందూ సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ శోభాయాత్ర గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది. కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం సభ్యులు, మహిళలు, యువత, భక్తులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


