బిజినపల్లి, సెప్టెంబర్ 19: నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో శ్రీ ఆంజనేయ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో భారీ వినాయకుడిని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. వినాయక చవితి సందర్భంగా కొలువుదీరిన గణనాథుడికి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పది రోజుల పాటు గణనాథుడికి ఘనంగా పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


