లక్నారం, సెప్టెంబర్ 19: బ్యాగ్‌లెస్ డే కార్యక్రమంలో భాగంగా లక్నారం ఎంఫీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు శనివారం గుండూరు మల్లయ్య ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా మల్లయ్య గారు కుండలు, మట్టి పాత్రలు తయారు చేసే విధానాన్ని విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. మట్టిని సిద్ధం చేయడం నుంచి వివిధ ఆకృతుల్లో పాత్రలను తయారు చేసే వరకు ప్రతి దశను విద్యార్థులకు వివరంగా చూపించారు.
కుండల తయారీ ప్రక్రియను విద్యార్థులు ఆసక్తిగా తిలకించడంతో పాటు కొంతమంది విద్యార్థులు స్వయంగా కుండలు తయారు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా మల్లయ్య గారు వివిధ రకాల మట్టి పాత్రలను తయారు చేసి చూపించారు. సంప్రదాయ వృత్తులు, కుండల తయారీ కళపై విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కల్పించడం పట్ల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.
ప్లాస్టిక్ బిందెలు, ప్లాస్టిక్ పాత్రల వినియోగాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన మరియు పర్యావరణహితమైన మట్టి పాత్రలు, మట్టి కుండలను వినియోగించాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. సంప్రదాయ కళలు, వృత్తుల ప్రాధాన్యతను తెలుసుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కుండల తయారీ కళాకారుడు గుండూరు మల్లయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కుండల తయారీపై ప్రత్యక్ష అనుభవాన్ని పొందారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


