బిజినపల్లి, సెప్టెంబర్ 19: నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పోలీస్స్టేషన్లో కొలువుదీరిన గణనాథుడి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగర్కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఐతో పాటు ఐదు మండలాల ఎస్సైలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బిజినపల్లి పోలీస్స్టేషన్ సిబ్బంది మొత్తం పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


