ఘట్కేసర్, సెప్టెంబర్ 18: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ 8వ వార్డు రాజీవ్ గృహకల్ప (ఆర్జీకే) కాలనీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పోచారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షులు కొమ్ము ప్రశాంత్ శుక్రవారం ఘట్కేసర్ సర్కిల్ డీఈ నరేష్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కొమ్ము ప్రశాంత్ మాట్లాడుతూ.. ఆర్జీకే కాలనీలో రాత్రి వేళల్లో వీధిలైట్లు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతోపాటు కాలనీలో పాముల భయం, దొంగల భయం నెలకొంటున్నాయని పేర్కొన్నారు. అలాగే శానిటేషన్ పరిస్థితి కూడా అధ్వానంగా మారిందని, పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు వీధిలైట్లను ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు.
డిప్యూటీ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో డీఈ నరేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను వివరించి వినతి పత్రం అందజేసినట్లు ప్రశాంత్ తెలిపారు. సమస్యలపై స్పందించిన డీఈ నరేష్.. విషయాన్ని ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, త్వరలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన డీఈ నరేష్‌కు కొమ్ము ప్రశాంత్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, అప్సర్, బి. రవి, అఫ్జల్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


