శుక్రవారం, 02 అక్టోబర్ 2026
వాతావరణం లోడ్ అవుతోంది...
తొలి కిరణం (Tholi Kiranam)
02-10-2026
అన్ని వార్తలు📰 ePaperతెలంగాణఆంధ్రప్రదేశ్భారత్అంతర్జాతీయవ్యాపారంక్రీడలుసాంకేతికతసినిమాఆరోగ్యంమా బృందం
హోమ్తెలంగాణఉద్యమకారుల హామీలు అమలు చేయాలి
తెలంగాణతాజా కథనం

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి
అల్వాల్‌లో రిలే నిరాహారదీక్షలు ప్రారంభంకాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్
ఎన్. నాజరేయుడూ
ఎన్. నాజరేయుడూ
రిపోర్టర్
2026-09-18
4 నిమిషాల పఠనం
11 వీక్షణలు
అక్షర పరిమాణం:సాధారణ
షేర్ చేయండి:
ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి

అల్వాల్, సెప్టెంబర్ 18: తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ దీక్షా శిబిరం వద్ద శుక్రవారం రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమకారులకు ఇప్పటికీ తగిన న్యాయం జరగలేదని అన్నారు. ఉద్యమ సమయంలో ఆస్తులు కోల్పోయి, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్న పలువురు ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. వయస్సుతో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలులో కాలయాపన చేస్తూ ఉద్యమకారులను నిరాశకు గురిచేయవద్దని సూచించారు. వందల ఎకరాల భూమి అందుబాటులో ఉన్నప్పటికీ వివిధ కారణాలతో హామీలను దాటవేస్తే మరోసారి ఉద్యమ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.
జేఏసీ నాయకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో అల్వాల్ ప్రజలు ఉద్యమ సత్తాను చాటారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి చెబుతూ మరొకటి చేస్తోందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో కేసులు నమోదైన వారినే ఉద్యమకారులుగా పరిగణించే ప్రతిపాదనను విరమించాలని కోరారు. పోలీసుల వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించి అర్హులైన ఉద్యమకారులను గుర్తించి, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, పుట్నాల కృష్ణ, డోలి సుధీర్, అనిల్, సంతోష్, రషీద్, వీరస్వామి, మల్లేష్, నిర్మల్ జేఏసీ చైర్మన్ సామ కిరణ్ కుమార్ రెడ్డి, పరమేశ్వర్, దొమ్మాటి కిరణ్, కీర్తి శ్రీనివాస్, ముత్యాలు, నర్సింహా, రామయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):
#తెలంగాణ#హైదరాబాద్#అభివృద్ధి#మేడ్చల్

పాఠకుల స్పందనలు & వ్యాఖ్యలు (0)

వ్యాఖ్యల మార్గదర్శకాలను పాటించండి

మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి:

* అసభ్యకర మరియు ద్వేషపూరిత వ్యాఖ్యలు నిరోధించబడతాయి.

ట్రెండింగ్ వార్తలు (Trending)

TOP 5

తాజా వార్తా ముఖ్యాంశాలు

తొలి కిరణం (Tholi Kiranam)

తెలుగు ప్రజలకు నమ్మకమైన, వేగవంతమైన మరియు నిష్పాక్షిక వార్తలను అందించే మీ డిజిటల్ న్యూస్ పోర్టల్.

వార్తా విభాగములు

  • • తెలంగాణ
  • • ఆంధ్రప్రదేశ్
  • • భారత్
  • • అంతర్జాతీయ
  • • వ్యాపారం
  • • క్రీడలు
  • • సాంకేతికత
  • • సినిమా
  • • ఆరోగ్యం
  • • మా బృందం

ముఖ్యమైన లింకులు

  • మా గురించి (About Us)
  • మా బృందం (Our Team)
  • గోప్యతా విధానం (Privacy Policy)
  • నిబంధనలు & షరతులు (Terms)
  • ప్రకటనల ధరలు (Ad Tariffs)

కార్యాలయ వివరములు

  • contact@tholikiranam.com
  • +91 1800-425-8888

© 2026 తొలి కిరణం (Tholi Kiranam). All rights reserved.

గోప్యతా విధానం•డిస్క్లైమర్•సంప్రదించండి