కోడూరు, తొలి కిరణం న్యూస్, సెప్టెంబర్ 17:
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం రాఘవరాజపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొవ్వొత్తులు వెలిగించారు.
మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, దేశ సేవలో మరింత కాలం కొనసాగాలని నాయకులు ఆకాంక్షించారు. కొవ్వొత్తుల వెలుగులతో పార్టీ కార్యాలయ ప్రాంగణం దేదీప్యమానంగా మారింది.
ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు టీడీపీ ఇన్చార్జి, కోడూరు చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బీజేపీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
దేశభక్తి, ఐక్యతను చాటుతూ వివిధ రకాల వెలుగులతో మోదీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


