మహాదేవునిపేట: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మహాదేవునిపేట గ్రామంలో భారతీయ జనతా యువమోర్చా (BJYM) ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ BJYM అధ్యక్షుడు కడారి పరమేష్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దే సామర్థ్యం మోదీకి ఉందని, ఆయన నాయకత్వంపై యువతలో సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో BJYM వైస్ ప్రెసిడెంట్ నందిపేట శివశంకర్, సోషల్ మీడియా ప్రముఖ్ దాసరి కురుమూర్తి, సీనియర్ నాయకులు కంటోజు నారాయణచారి, గుడ్లున్నారో బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, గుడ్ల నర్వ రాము, రాగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


