నాగర్‌కర్నూల్: వికసిత్ భారత్ సేవా సంకల్పం అభియాన్‌లో భాగంగా, నాగర్‌కర్నూల్ టౌన్ కో-కన్వీనర్, బీజేపీ టౌన్ ప్రధాన కార్యదర్శి వారధి శ్రీను పటేల్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను గురువారం నాగర్‌కర్నూల్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల మహిళల పాదాలను పాలతో కడిగి పాదపూజ నిర్వహించారు. అనంతరం వారికి చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశానికి మరింత సేవలందించాలని ఆకాంక్షిస్తూ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
దేశాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం మోదీ చేస్తున్న కృషిని నాయకులు ప్రస్తావించారు. ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై ప్రగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
పాల్గొన్నవారు: మున్సిపల్ కమిషనర్‌తో పాటు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బూసి రెడ్డి సుధాకర్ రెడ్డి, మల్లెకేడి లక్ష్మణ్, బీజేపీ మహిళా మోర్చా నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు పద్మ యాదవ్, ప్రగతి గౌడ్, సరిత, నాగర్‌కర్నూల్ టౌన్ అధ్యక్షుడు చెవ్వ ప్రమోద్ కుమార్, టౌన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి, మాజీ టౌన్ ప్రధాన కార్యదర్శి కొండమూలి సైదులు, మాజీ టౌన్ ఉపాధ్యక్షుడు పొల్లమూలి పర్వతాలు, చరణ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



