గోపాల్పేట: వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి ప్రభుత్వం అండగా నిలుస్తోందని గ్రామస్తులు తెలిపారు.
ఎమ్మెల్యే మేఘా రెడ్డి సహకారంతో, గ్రామ సర్పంచ్ లోకా రెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో గ్రామంలో హర్షం వ్యక్తమవుతోంది. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఊరట లభించిందని గ్రామస్తులు పేర్కొన్నారు.
తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే మేఘా రెడ్డికి, గ్రామ సర్పంచ్ లోకా రెడ్డికి గ్రామ ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఆరో వార్డు వంశీకృష్ణ, నాలుగో వార్డు గౌరునేని లక్ష్మి, ఒకటో వార్డు కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


