వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని చందన బ్రదర్స్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులపాటు గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చందన బ్రదర్స్ యాజమాన్యం, సిబ్బంది మాట్లాడుతూ తమ వ్యాపారాలు మరింత అభివృద్ధి చెంది మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలని వినాయకుడిని ప్రార్థించారు. తమ కుటుంబాలపై ఎల్లప్పుడూ గణనాథుడి ఆశీస్సులు ఉండాలని, సుఖసంతోషాలతో జీవించేలా అనుగ్రహించాలని వేడుకున్నారు.
వినాయక ఉత్సవాల్లో చందన బ్రదర్స్ మేనేజర్ జగదీష్ కుమార్, మేనేజర్ సాయి చందు, చందన బ్రదర్స్ సిబ్బంది పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


