నంది వడ్డేమాన్: నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో భారీ గణనాథుని ప్రతిష్ఠించారు. ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి యువత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
గత 30 సంవత్సరాలుగా ఇదే ప్రదేశంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది కూడా భారీ వినాయకుడిని ప్రతిష్ఠించి 12 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ గణనాథుడికి పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఉత్సవాలను యువసేన యూత్ అధ్యక్షుడు పొట్టల అమీర్, ఉపాధ్యక్షుడు చపల హరికృష్ణ, ఆంజనేయులుతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు ఉత్సాహంగా పాల్గొని నిర్వహిస్తున్నారు.



