తెలకపల్లి, సెప్టెంబర్ 16: జడ్పీహెచ్ఎస్ తెలకపల్లి పాఠశాలను గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్మాణంలో ఉన్న తరగతి గదులు, ఇంకుడు గుంత నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ బాలరాజును సూచించారు.
అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆకుకూర పప్పు, కోడిగుడ్డు అందిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తర్వాత సర్పంచ్ చంద్రశేఖర్, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేయడంతో పాఠశాలలో ఆత్మీయ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభన్ బాబు, సింగిల్ విండో డైరెక్టర్ యాదయ్య, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

